schedule Monday, August 24, 2026

గణేష్ నవరాత్రి ఉత్సవాలు 

calendar_today September 8, 2024
person meenewstelugu
గణేష్ నవరాత్రి ఉత్సవాలు 

గణేష్ నవరాత్రి ఉత్సవాలు 

 --తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజి యాదవ్ . 

--150 విగ్రహాలను పంపిణీ 

--సూర్యాపేట జిల్లా కోదాడ.

సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేట జిల్లా కోదాడ...: కులమతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో యువత,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,మహిళలు గణేష్ భక్తులు జరుపుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.

శనివారం అంజి యాదవ్ నివాసంలో నియోజకవర్గ యువజన సంఘాల సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయన అంజి యాదవ్ పాల్గొని మాట్లాడుతూ యువత చదువుతోపాటు భక్తి మార్గంలో నడవడం వలన యువత తప్పుదారి పట్టకుండా వారు సక్రమమైన మార్గంలో నడవడానికి ఈ భక్తి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేడు నియోజకవర్గంలో యువత గణేష్ విగ్రహాలను కొనాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది అందువలన యువత ఇబ్బంది పడకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 150 విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు.ఈ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని అన్నారు.