మీ న్యూస్ ప్రతినిధి :::తాండూరు పట్టణంలోని ఎరువుల దుకా ణాలపై ఎంపీడీవో విశ్వ ప్రసాద్, ఏఓ కొమురయ్య, పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో, తహసీల్దార్, ఏఓ, ఎస్ఐ లను మండల స్థాయి టాస్క్ ఫోర్స్ టైమ్ గా ఏర్పడి ఏర్పాటు చేశారు. ఈ మేరకే మన గ్రోమోర్ సెంటర్, మహేశ్వరి, కావేరి, రవిరాజ్ ఎరువుల దుకాణల్లో
తనిఖీలు చేశారు.ఆయా ఎరువుల దుకాణం లోని స్టాక్‌ను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ.. రికార్డులను సక్రమంగా మెయింటెన్ చేయాలని, రైతులు కొన్న విత్తనాలు, ఎరువులకు రశీదులు అందించాలన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించవద్దని సూచించారు. ప్రభు త్వ నిబందనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అయితే ఇందులో ఏమైన అక్ర మాలు జరిగాయా అనే కోణంలో దుకా ణాల రికార్డులను పరిశీలించామన్నారు. ఎరువుల అమ్మకాల్లో అక్రమా లు జరిగేతే సహించేది లేదని చెప్పారు.