schedule Saturday, August 22, 2026

బురదలోకి దిగి మహిళ రైతుల కష్టాన్ని పంచుకున్న కంజర్ల విజయక్క

calendar_today August 8, 2026
person meenewstelugu
బురదలోకి దిగి మహిళ  రైతుల కష్టాన్ని పంచుకున్న కంజర్ల విజయక్క

పొలంలో మహిళా రైతులతో కలిసి వరి నాట్లు పెట్టన కంజర్ల విజయక్క

మహిళా రైతులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ 

రైతు కుటుంబాల సంక్షేమం,కోసం మే ఫౌండేషన్ లక్ష్యం 

 

తాండూర్  మీ న్యూస్ ప్రతినిధి:::  బాషీరాబాద్ మండలం లో ఈ రోజు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ (విజయక్క) మహిళా రైతులతో కలిసి వరి నాట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా రైతులతో కలిసి పొలంలోకి దిగి నాట్లు వేస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మహిళా రైతులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి కుటుంబ పరిస్థితులు, వ్యవసాయ సమస్యలపై చర్చించారు. వారితో కలిసి స్నాక్స్ ఆరగిస్తూ, జానపద పాటలు పాడి సందడి చేశారు. దీంతో మహిళా రైతులు విజయక్కతో తమ అనుబంధాన్ని ఆనందంగా పంచుకున్నారు.ఈ సందర్భంగా విజయక్క మాట్లాడుతూ, "రైతు కుటుంబాల సంక్షేమం, మహిళా సాధికారతే ఫౌండేషన్ లక్ష్యం అని మహిళలకు అండగా ఎల్లప్పుడూ నిలుస్తాను" అని తెలిపారు