schedule Monday, November 02, 2026

విద్యుత్ షాక్ తో గురైన వారి కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్ అండగా

calendar_today October 13, 2026
person meenewstelugu

 నిండిన మానవత్వం. తో కుటుంబానికి నీ నిత్యవసర  సరుకులు పంపిణీ 

బాధిత కుటుంబాన్ని ఆదుకున్న కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్.

మీ న్యూస్ ప్రతినిధి::యాలాల మండలం రాస్నం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పెను ప్రమాదం చోటుచేసుకుంది. కుమ్మరి బుచ్చమ్మకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులతో పాటు కష్టపడి దాచుకున్న నగదు కూడా కాలిపోయింది. దీంతో సుమారు రూ.50 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది. ఒక్కసారిగా ఇల్లు కాలిపోవడంతో బుచ్చమ్మ కుటుంబం రోడ్డున పడింది.విషయం తెలుసుకున్న కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మానవతా దృక్పథంతో నిత్యావసర వస్తువులను అందజేసి అండగా నిలిచారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తామని" హామీ ఇచ్చారు.