schedule Tuesday, August 25, 2026

నక్కల వాగును పరిశీలించిన అడ్డగుడూర్ ఎమ్మార్వో శేషగిరిరావు

calendar_today September 1, 2024
person meenewstelugu
నక్కల వాగును పరిశీలించిన అడ్డగుడూర్ ఎమ్మార్వో శేషగిరిరావు

నక్కల వాగును పరిశీలించిన అడ్డగుడూర్ ఎమ్మార్వో శేషగిరిరావు

మీ::ప్రతినిధి( శివ నవీన్)  బంగాళాఖాతం వాయుగుండంగా మారిన పరిణామాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం లో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు,వంకలు నిండి పొంగి పొర్లిపోతున్నాయి. నేడు అడ్డగుడూర్ మండలం గోవిందపురం గ్రామ సమీపాన ఉన్న నక్కల వాగు రెండు రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షానికి పొంగిపొర్లిపోతున్న సందర్భంగా స్థానిక అడ్డగుడూర్ మండల తహసీల్దార్ శేషగిరిరావు స్వయంగా పరిశీలించి వాహన దారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అక్కడ వాహన దారులకు ఇబ్బంది కలకుండా రహదారి పై గోస్లో బోర్డు లు పెట్టడం జరిగింది.ప్రజలు తప్పని పరిస్థితుల్లో బయటి రావాలే గాని అనవసరంగా రావొద్దు అని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకరయ్య ఎంపీవో ప్రేమలత అడ్డగుడూర్ RI, కార్యదర్శులు నరేష్ చంద్రశేఖర్ BRS పార్టీ యువ నాయకులు బాలెంల నరేందర్, గ్రామస్తులు కందుకూరి అనిల్ గ్రామ పంచాయతీ సిబ్బంది బిరప్ప,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు........