schedule Saturday, August 22, 2026

హోలీ రంగులు ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందమయం కావాలి.

calendar_today March 5, 2026
person meenewstelugu
హోలీ రంగులు ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందమయం కావాలి.

ఘనంగా హోలీ వేడుకలు 

అంబరానంటిన హోలీ సంబరాలు.

మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్.

మీ న్యూస్ తాండూరు...... హోలీ రంగులు ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందమయం కావాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు.తాండూరు పట్టణంలో బుధవారం హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వైభోగంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల నాయక్ మాట్లాడుతూ హోలీ సంబరాలు అంటే పేద,ధనిక అని తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకోవడం కులమతాలకతీతంగా ప్రజలందరూ మహిళలు యువకులు ఒకరికొకరు రంగుల హోళీ వేడుక అన్నారు. మన సాంప్రదాయాలు, మరువకూడదని భవిష్యత్తులో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను పెద్ద ఎత్తున పండుగలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్, కోకట్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వర్య్త కిష్టమ్మ, వర్య్తప్రశాంతి,రుక్కీ బాయ్ రవి తదితరులు పాల్గొన్నారు.