schedule Saturday, August 22, 2026

గర్భిణికి రక్తదానం చేసిన రాజు పటేల్ 

calendar_today March 3, 2026
person meenewstelugu
గర్భిణికి రక్తదానం చేసిన రాజు పటేల్ 
 

 మానవత్వం చాటుకున్న శేరి రాజు పటేల్ 

 రక్తదానం దానం చేసిన అంతారం యువకుడు

 అభినందించిన కుటుంబ సభ్యులు 

మీ న్యూస్ తాండూర్:::

 అత్యవసర పరిస్థితుల్లో గర్భిణికి రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు అంతారం గ్రామానికి చెందిన శేరి రాజు పటేల్. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం ఐనెల్లి గ్రామనికి చెందిన మాసని వీరమాణి భర్త యోహాన్ రెండవ కాన్పు కోసం తాండూర్ పట్టణంలోని JB హాస్పిటల్ ప్రైవేటు ఆసుపత్రిలో విరమణి అనే గర్భిణికి బి-పాజిటివ్‌ రక్తం అత్యవసరంగా ఎక్కించాలని వైద్యులు తెలపడంతో సమాచారం తెలుసుకున్న అంతారం గ్రామానికి చెందిన శేరి రాజు పటేల్. తక్షణం ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి ఇద్దరి ప్రాణాలను కాపాడినారు. విషయం తెలుసుకున్న మేనమామ మ్యాతరి చందు రక్తదానం చేసిన రాజు పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు.