అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన DSP రవి
calendar_today
September 1, 2024
person
meenewstelugu
అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన DSP రవి
అవసరం లేకుండా ఇంటి నుండి బయటికి రావద్దని ప్రజలకి సూచన.
మీ న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్
నిన్నటినుండి కురుస్తున్న అధికావర్షాల కారణంగా సూర్యాపేట జిల్లా, పరిసర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూర్యాపేట DSP రవి సూచించారు. నిన్నటినుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసి, సద్దల చెరువు పరివాహక ప్రాంతాల ప్రజలు అనవసరంగా ఇంటినుండి బయటికి రావద్దని సూచించారు. శనివారం సాయంత్రం సూర్యాపేట DSP రవి, పట్టణ, రూరల్ CI లు సూర్యాపేట సద్దల చెరువు, బీమారం, మూసి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. పిల్లలు ఇండ్ల నుండి వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో ఎటువంటి దూరప్రయాణాలు చేయొద్దని సూచించారు.