మీ న్యూస్ ప్రతినిధి జూన్ 7:సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గత కొంత కాలం నుండి హుజూర్ నగర్ నుండి కోదాడ వరకు ఉన్న నేషనల్ హైవే -167 రోడ్ల మీదకు రాత్రి సమయంలో గేదెలు ఆకస్మాత్తుగా రావటం వలన రోడ్డు పై వెళ్తున్న వాహనాలు అట్టి గేదెలకు గుద్దుకోవటం వలన ప్రమాదాలు జరిగి అట్టి గేదెలు, మనుషులు చనిపోవటం జరుగుతున్నది.కావున చిలుకూరు మండల ప్రజలకు తెలియజేయునది మీ యొక్క గేదెలను మీరే దగ్గరుండి మేపుకొని ఇండ్లలో కట్టివేసుకోగలరు.అవి రోడ్ల మీదకు రాకుండా జాగ్రత పడగలరు.మీ గేదెలు రోడ్ మీదకు రావడం వలన ఎలాంటి ప్రమాదం జరిగిన మీపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడుతుంది అని చిలుకూరు ఎస్సై సురభి రాంబాబు హెచ్చరిచారు.