schedule Saturday, August 22, 2026

సాయికుమార్ ఆత్మహత్య

calendar_today June 3, 2025
person meenewstelugu
సాయికుమార్ ఆత్మహత్య

సాయికుమార్ ఆత్మహత్య

 మీ న్యూస్ ప్రతినిధి జూన్ 3:-సూర్యాపేట: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట అఫ్జల్ రైస్ మిల్ ప్రాంతానికి చెందిన సారగండ్ల సాయికుమార్ అలియాస్ ఆంజనేయులు తండ్రి లేట్ పిచ్చయ్య వయస్సు 29 సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా పొట్టి శ్రీరాములు సెంటర్లో ఐఫోన్ టెక్ (ఆండ్రాయిడ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్) అనే పేరు మీద షాప్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బంధువులు సాయికుమార్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

   

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కో ల రవీందర్ గౌడ్ 9640659560