భూమి సమస్యలు, తగాదాలు ఉంటే సామరస్యంగా చట్టపరిదిలో పరిష్కరించుకోవాలి
calendar_today
May 28, 2025
person
meenewstelugu
భూమి సమస్యలు, తగాదాలు ఉంటే సామరస్యంగా చట్టపరిదిలో పరిష్కరించుకోవాలి
చట్టాన్ని ఉల్లంఘిస్తూ భౌతిక దాడులకు పాల్పడితే జైలు పాలవుతారు
రైతులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా
మీ న్యూస్ ప్రతినిది మే 27 :-వర్షాకాలం సమీపిస్తున్నది, రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు, ఈ క్రమంలో వ్యవసాయ భూమి హద్దులు, దారి, విస్తీర్ణం, నీటివనరులు లాంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతారు, చాలా సందర్భాల్లో ఇవి తీవ్ర సమస్యలు అవుతున్నాయి, చాలా ఫిర్యాదులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలో రైతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పరస్పరం భౌతిక దాడులకు పూనుకోవద్దు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు సామరస్య ధోరణితో ముందుకెళ్లాలని అన్నారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించుకోవడానికి పెద్ద మనుషుల సమక్షంలో సున్నితంగా సమస్యలను పరిశీలించుకోవాలి, లేదా చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి అన్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అధికారులను ఆశ్రయించాలి, సర్వేల ద్వారా ముందుకు వెళ్ళాలి, రికార్డ్స్ ను పరిశీలించాలి, సివిల్ కోర్టులను ఆశ్రయించాలని అన్నారు. తీవ్రమైన సమస్యల్లో ఉన్న భూముల పైకి కోర్టు ఉత్తర్వులు లేకుండా ఎవరు కూడా వెళ్ళవద్దు, భూమిపై సేద్యంలో ఉన్న ఇతరులను ఇబ్బందులు పెట్టవద్దు అన్నారు. పంటలు నష్టం చేయడం, హద్దులు చెరపడం లాంటి క్రిమినల్ చర్యలకు పునుకోవద్దు అని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఒకరికొకరు భౌతిక దాడులకు దిగడం వివాదాలు పెట్టుకోవడం వల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయని తెలిపారు. సివిల్ కోర్టు ఉత్తర్వులైనటువంటి అడ్వకేట్ కమీషన్, బేల్ లిఫ్ మరియు కోర్టు ద్వారా పోలీస్ ప్రోటక్షన్ లాంటివి పొందాలని అన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.