schedule Monday, August 24, 2026

ప్రమాదవశాత్తు కాలువలో మునిగి గల్లంతైన వ్యక్తి...

calendar_today August 30, 2024
person meenewstelugu
ప్రమాదవశాత్తు కాలువలో మునిగి గల్లంతైన వ్యక్తి...

ప్రమాదవశాత్తు కాలువలో మునిగి గల్లంతైన వ్యక్తి...

మీ న్యూస్ సూర్య పేట్ ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్

సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగి గల్లంతైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఆత్మకూర్ యస్ మండలం కేంద్రానికి చెందిన గొట్టెకొప్పుల గోపాల్ రెడ్డి (40) వృత్తికి లారీ ఓనర్. ఇతను కొంతకాలం నుండి జగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నాడు. తన స్వగ్రామమైన ఆత్మకూర్ మండల కేంద్రం నుండి తిరిగి జగ్గయ్యపేటలో తన నివాసానికి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో మునగాల వద్ద ఆగి ఎన్ఎస్పి కాల్వ వద్ద అయ్యప్పస్వామి టెంపుల్ ఎదురుగా ఈత కొట్టేందుకు కాలువలో దిగాడు. అయితే ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతుని వివరాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇతని బాడీ దొరికినట్టు అయితే మాకు తెలపగలరు.