పేదింటి బిడ్డకు పదవ తరగతిలో తెలుగులో వందకు వంద మార్కులు
calendar_today
May 16, 2025
person
meenewstelugu
పేదింటి బిడ్డకు పదవ తరగతిలో తెలుగులో వందకు వంద మార్కులు
మీ న్యూస్ ప్రతినిధి మే 14:-మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన శకునం భట్ల శ్రీనివాస్ రెడ్డి మాధవిల కుమార్తె ప్రణీత రెడ్డి తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతూ 600కు 568 మార్కులు రావడం జరిగింది తెలుగులో 100కు 100 మార్కులు రావడంతో తల్లిదండ్రులు సంతోషం పడుతు ఆనందంతో ప్రిన్సిపాల్ మేడం శ్రీదేవి గారికి మరియు తెలుగు టీచర్ కొండయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బొల్లారంలో నివాసం ఉంటు తెలంగాణ ఆదర్శ పాఠశాలలో వారి కుమార్తెను చదివిస్తున్నారు గవర్నమెంట్ పాఠశాల అయిన తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువులు బాగా చెబుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.