schedule Sunday, August 23, 2026

కుల, వర్గ జెమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న

calendar_today May 16, 2025
person meenewstelugu
కుల, వర్గ జెమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న

కుల, వర్గ జెమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న

 

 ⏩:-ఆశయ సాధనకై కృషి చేయాలి

 ⏩:-సిపిఐ( ఆర్ ఎం ) రాష్ట్ర కార్యదర్శి చామకూరి నర్సయ్య

 

మీ న్యూస్ ప్రతినిధి:-సూర్యాపేట కుల,వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న ఆశయ సాధన కోసం కృషి చేయాలని సిపిఐ( ఆర్ ఎం ) రాష్ట్ర కార్యదర్శి చామకూరి నర్సయ్య అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులోని భీమ్ రెడ్డి నరసింహారెడ్డి విగ్రహం వద్ద మా రోజు వీరన్న స్మారక కమిటీ ఆధ్వర్యంలో బహుజన సిద్ధాంతకర్త మారోజు వీరన్న 26వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో వర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా కుల నిర్మూలన జరగాలని అప్పుడే శ్రామిక రాజ్యం ఏర్పడుతుందని మారోజు వీరన్న అన్నారని అన్నారు. ఈ దేశంలో అన్ని కమ్యూనిస్టు పార్టీల కన్నా ముందే కుల సమస్యను మొట్టమొదట గుర్తించింది మారోజు వీరన్న అన్నారు. శ్రమజీవుల రాజ్య సాధనకై తన జీవితాంతం పోరాడని అన్నారు. దేశంలో కొనసాగుతున్న నిచ్చెన మెట్ల సామాజిక కుల సమస్యపై తిరుగుబాటు చేసి కుల నిర్మూలన జరగకుండా ఐక్యం కాదని వీరన్న చెప్పారని అన్నారు. వీరన్న ఆశయం నెరవేరాలంటే దళిత, బహుజనులు ఐక్యమై రాజ్యాధికార పోరాటంలో ముందుకు వచ్చి సామాజిక అసమానతలు లేని మానవ ప్రపంచాన్ని నిర్మాణం చేసినప్పుడే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ వర్గం అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ, ఎం సిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, ఎం సి పి ఐ (యు) జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, నాయకులు వెంకన్న, రాములు, సోమయ్య, సైదమ్మ, ఎల్లయ్య పాల్గొన్నారు.