వేసవిలో వ్యవసాయ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి
calendar_today
May 15, 2025
person
meenewstelugu
వేసవిలో వ్యవసాయ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి
మీ న్యూస్ ప్రతినిధి మే 14:-ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వ్యవసాయ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి,డాక్టర్. జే. రమ్య తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అంబెడ్కర్ నగర్ ఆధ్వర్యంలో కార్మికులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వడ దెబ్బ తగలకుండా తరుచుగా మంచినీళ్లు, నిమ్మరసం, పండ్లరసాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజాద్ అలీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్, ఆలేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.