schedule Sunday, August 23, 2026

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత

calendar_today May 7, 2025
person meenewstelugu
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత

చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

మీ న్యూస్ ప్రతినిధి మే 6::సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గారు ఇటీవల ఆకాలంగా మరణించడం జరిగినది. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడం లో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు రమేష్ గారి కుటుంబ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. క్తుంభాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని ఎస్పి గారు తెలిపినారు. చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారు అని అభినందించారు, పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సెప్షల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, వెల్ఫేర్ RSI సాయిరాం, బరోసా సెంటర్ మహిళా SI మౌనిక, సంఘం సభ్యులు పాల్గొన్నారు.