schedule Monday, August 24, 2026

చిట్యాల ఎల్లయ్య జ్ఞాపకార్థంగా మజ్జిగ పంపిణీ

calendar_today May 2, 2025
person meenewstelugu
చిట్యాల ఎల్లయ్య జ్ఞాపకార్థంగా మజ్జిగ పంపిణీ

చిట్యాల ఎల్లయ్య జ్ఞాపకార్థంగా మజ్జిగ పంపిణీ

మీ న్యూస్ ప్రతినిది:: మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు వద్ద మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు మరియు గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర పాల్గొన్నారు వారు పాల్గొని గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర కుటుంబ సభ్యులు కలిసి తండ్రి అయిన క్రీస్తు శేషులు చిట్యాల ఎల్లయ్య జ్ఞాపకార్థంగా కార్మికులందరికీ మరియు బాటసారి అందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల భవన నిర్మాణ కార్మికులు పెయింటర్స్ కార్మికులు ఆటో యూనియన్ కార్మికులు మరియు ఇతర రంగ కార్మికులందరూ పాల్గొన్నారు