schedule Monday, August 24, 2026

సమాజ సమానత్వానికి మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు

calendar_today April 30, 2025
person meenewstelugu
సమాజ సమానత్వానికి మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు

సమాజ సమానత్వానికి మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు

⏩::కేంద్ర ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలి

⏩::జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ 

⏩::బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బసవ జయంతి ఉత్సవాలు

 

మీ న్యూస్ ప్రతినిధి::సామాజిక తత్వవేత్త సంఘ సంస్కర్త, మహాత్మా బసవేశ్వర 'బసవ' జయంతి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు ప్రవచించిన మానవత సూత్రాలు విశ్వమానవ సౌబ్రాతృత్వము, సమానత్వం, మానవ మనుగడకు సమాజ హితానికి ఎంతగానో దోహదం చేశాయి అని వారు తెలియజేసారు. వారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం బసవ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాజ్ కుమార్ అన్నారు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆశయాలను సాధించే మార్గంలో కొనసాగుతామని వారు పునరుద్ఘాటించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ బస్వరాజ్ ,బిసి సంఘం మహిళా అధ్యక్షురాలు అనిత నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు మంజుల 

నియోజకవర్గ కార్యదర్శి జగదీశ్వరి

నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సగర ,తాండూరు బీసీ యువ నాయకుడు రాము ముదిరాజు, బషీరాబాద్ మండల అధ్యక్షుడు నరేందర్, బీసీ నాయకులు బాబా గౌడ్ బీసీ యువజన సంఘం పెద్దేముల్ అధ్యక్షులు బంగారు నవీన్, బీసీ సంఘం నాయకులు గోపి, కిరణ్, రాజు, అరుణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.