schedule Monday, August 24, 2026

కోదాడలో ఘోరం.... కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయం

calendar_today April 28, 2025
person meenewstelugu
కోదాడలో ఘోరం.... కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయం

కోదాడలో ఘోరం.... కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయం

⏩::సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...

మీ న్యూస్ ప్రతినిధి::ఇంటి లోపల వరండాలో ఆడుకుంటున్న మూడు సంవత్సరాల బాలుడు పై కుక్క దాడి చేసికరిచింది. ఈ సంఘటన సోమవారం కోదాడ పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్ లో చోటు చేసుకుంది. ఖమ్మం క్రాస్ రోడ్ లో 18 వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవి కుమారుడు కొండపల్లి వర్షిత్ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా గేటు కింద నుండి వచ్చిన కుక్క బాలుడు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో తల్లిదండ్రులలో హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కొరకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకెళ్లారు. ఇదే కుక్క గణేష్ నగర్ తిలక్ నగర్ ఖమ్మం క్రాస్ రోడ్ లోని సుమారు 17 మందిపై ఒకేరోజు దాడి చేసినట్లుగా సమాచారం. కుక్కలు విపరీతంగా రోడ్లపై తిరుగుతున్న మున్సిపాలిటీ అధికారులు వాటినీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇటీవల కుక్క దాడిలో రాష్ట్రవ్యాప్తంగా అనేక మరణాలు నమోదు అవుతున్నాయి. అయినా అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదని పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.