schedule Monday, August 24, 2026

గ్రామానికి ఫ్రీజర్ బాక్స్ బహుకరణ

calendar_today August 29, 2024
person meenewstelugu
గ్రామానికి ఫ్రీజర్ బాక్స్ బహుకరణ

గ్రామానికి ఫ్రీజర్ బాక్స్ బహుకరణ

చుక్క బాబు, చుక్క సందీప్ సొంత ఖర్చులతో ఫ్రీజర్ బాక్స్ బహుకరించారు. 

 అడ్డగూడూరు ప్రతినిధి శివ నవీన్:: అడ్డగూడూరు: మండలంలోని బొడ్డుగూడెం గ్రామానికి చెందిన చుక్క బాబు, చుక్క సందీప్ ఇద్దరు వారి గ్రామ ప్రజలకు సేవ చేయాలనే తపనతో సొంత ఖర్చులతో ఫ్రీజర్ బాక్స్ బహుకరించారు.దానిని గురువారం గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే ఫ్రీజర్ బాక్స్ కొరకు గ్రామస్థులు పడుతున్న ఇబ్బందుల దృశ్య ఫ్రీజర్ బాక్స్ గ్రామానికి అందజేశామన్నారు. అనంతరం వారిని గ్రామస్తులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొమ్ము సత్యనారాయణ, మాజీ సర్పంచ్ వేంపల్ల నర్సిరెడ్డి, చుక్క దేవయ్య, నాగేష్ నాయుడు, సమ్మెట స్వామి, మిడిదొడ్డి రాజయ్య, కురుమిళ్ళ రాజకుమార్, ఎలుక మల్లయ్య, దోమల శ్రీశైలం, పండుగ మల్లేష్, ప్రశాంత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.