schedule Monday, August 24, 2026

సంస్థగతంగా బిజెపిని బలోపేతం చేద్దాం

calendar_today April 21, 2025
person meenewstelugu
సంస్థగతంగా బిజెపిని బలోపేతం చేద్దాం

సంస్థగతంగా బిజెపిని బలోపేతం చేద్దాం

మీ న్యూస్ ప్రతినిధి::సంస్థగతగా బిజెపి పార్టీని బలోపేతం చేద్దామని రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బిజెపిని కోరుకుంటున్నారని తెలిపారు.ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ పై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించాలన్నారు.కేంద్ర, రాష్ట్ర పార్టీ ఇచ్చే పిలుపులను కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకొని అత్యధిక స్థానాలలో విజయం సాధించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి రాజమౌళి, రాష్ట్ర నాయకులు బొబ్బ భాగ్యరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు సలిగంటి వీరేంద్ర, మల్లెపాక సాయిబాబా, అసెంబ్లీ కన్వీనర్లు కాపా రవికుమార్, కనగాల నారాయణ, రాష్ట్ర నాయకులు నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, వంగవీటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.