schedule Saturday, August 22, 2026

తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పట్టణ కార్యదర్శి గా కంది బండ సూరయ్య

calendar_today April 4, 2025
person meenewstelugu
తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పట్టణ కార్యదర్శి గా కంది బండ సూరయ్య

తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పట్టణ కార్యదర్శి గా కంది బండ సూరయ్య

మీ న్యూస్ మార్చి 3::తెలంగాణ స్టేట్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సూర్యాపేట పట్టణ శాఖ కార్యదర్శిగా కంది బండ సూరయ్యను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు ఆరే రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో పట్టణ కార్యదర్శిగా ఉన్న మహంకాళి సోమయ్య సంఘ నియమాలకు విరుద్ధంగా పనిచేస్తున్నందున రాష్ట్ర అధ్యక్షులు ఆదేశానుసారం 11 మంది సభ్యులుగా గల క్రమశిక్షణ కమిటీ నిర్ణయ మేరకు ప్రాథమిక సభ్యత్వాన్ని, కార్యదర్శి పదవిని తొలగించినట్లుతెలిపారు. ఇప్పటినుండి సోమయ్యకు టాస్కాకు ఎలాంటి సంబంధం లేదనీ, వారికి ఎలాంటి సభ్యత్వ రుసుములు కానీ ఇతర సమస్యలపై అప్లికేషన్లు, డబ్బులు ఇచ్చినచొ టాస్కా ఎలాంటి బాధ్యత వహించదన్నారు. టాస్కా సూర్యాపేట పట్టణ శాఖలో ఏర్పడిన కార్యదర్శి పోస్టు సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న కందిబండ సూరయ్య ను పట్టణ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సర్వసభ్య సమావేశంలో ఘనంగా సన్మానించి బాధ్యతలు ఇవ్వనైనది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి గుడుగుంట్ల విద్యాసాగర్, కోశాధికారి బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, పట్టణ అధ్యక్షులు ఎస్.భాస్కరాచారి, కోశాధికారి మిరియాల సుధాకర్, గౌరవ సలహాదారులు కర్నాటి కిషన్, దా0డ్గే సుభాష్, ట్రిబనల్ మెంబర్స్ కాకి మల్లారెడ్డి, ఎస్ అన్నపూర్ణమ్మ సభ్యులు దండ వెంకట్ రెడ్డి, కేశవులు, సుజాత, లక్ష్మమ్మ ,పిచ్చమ్మ, కమలమ్మ, ముకుంద రెడ్డి, సురేందర్ రెడ్డి , 60 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.