schedule Saturday, August 22, 2026

ముఖ్యమంత్రి పర్యటనకు పోలీస్ పటిష్ట బందోబస్తు

calendar_today March 29, 2025
person meenewstelugu
ముఖ్యమంత్రి పర్యటనకు పోలీస్ పటిష్ట బందోబస్తు

ముఖ్యమంత్రి పర్యటనకు పోలీస్ పటిష్ట బందోబస్తు

⏩::బందోబస్తు ఏర్పాట్లు పూర్తి. 

 

⏩::బందోబస్తులో 1500 మంది పోలీస్ సిబ్బంది. 

 

⏩:+సభకు వచ్చే ప్రజలు. వాహనదారు లు పోలీస్ సూచనలు పాటించాలి 

 

⏩::మీటింగ్ ప్రాంగణానికి అన్ని మార్గాల్లో వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలు కేటాయింపు.

⏩::కే నరసింహ ఐపీఎస్. ఎస్పీ సూర్యాపేట జిల్లా 

⏩::మీ న్యూస్ మార్చి 29::ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హుజూర్నగర్ పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ అన్ని రక్షణ ఏర్పాటు చేయడం జరిగినది జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు హుజూర్నగర్ లో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను. మార్గాలు. సభా ప్రాంగణాన్ని. పార్కింగ్ ప్రదేశాలను. హెలిపాడ్ ప్రదేశాన్ని ఎస్పి పోలీస్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1500 మంది పోలీస్ సిబ్బంది రక్షణ బందోబస్తు నిర్వహిస్తారు అని అన్నారు అన్ని ఏర్పా పూర్తి చేశామని. జిల్లా యంత్రాంగం ఇతర శాఖల సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి సభకు వచ్చేవారి వాహనాలు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా.వాహనాల ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకున్నాము. కోణాల మళ్లింపు. వాహనాల పార్కింగ్ ప్రణాళిక చేశాం అని అన్నారు. సభా ప్రాంగణానికి చేరుకునేలా అన్ని మార్గాల్లో వాహనాలు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారు కార్యక్రమానికి వచ్చేవారు వారి యొక్క వానాలను ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. మార్గమధ్యలో పోలీసు వారి సూచనలు పాటించాలని అన్నారు. ఈ ఒక్క కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు. డీఎస్సీ శ్రీధర్ రెడ్డి. హుజూర్నగర్ సిఐ చలమంద రాజు. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు