schedule Tuesday, August 25, 2026

అంధకారంలో మర్రిగడ్డ ఎస్సీ కాలనీ ....

calendar_today August 29, 2024
person meenewstelugu
అంధకారంలో మర్రిగడ్డ ఎస్సీ కాలనీ ....

అంధకారంలో మర్రిగడ్డ ఎస్సీ కాలనీ ....

....

కాలనీల్లో వీధి దీపాలు వెలుగడం నిలిచిపోయి వారాలు కావస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు.....

పట్టించుకోని పాలన ప్రత్యేక అధికారులు....

మీ: న్యూస్:(29 ఆగస్టు 2024) అడ్డ గూడూరు ప్రతినిధి శివ నవీన్  

అడ్డగూడూర్ పట్టణ కేంద్రంలో గల మర్రిగడ్డలోని ఎస్సీ కాలనీలో గల కరెంట్ స్తంభాలకు వెలగాల్సిన కరెంట్ బల్బులు గత వారం పది రోజులుగా వెలుగడం లేదు.ఏదో ఒక స్తంభం దగ్గరే బల్బు పోయిందనుకుంటే ఆ పక్కనే ఉన్న స్తంభపై వెలుగుతున్న కరెంట్ బల్బు వెలుతురు సహాయంతో కాలనీ వాసులు కాలినడకన మార్గంలో ఇండ్లలోకి చేరుకోవచ్చు కానీ ఇక్కడ అలాంటి అవకాశమే లేదు.దారి పోడవునా అలాగే ఇంటి దగ్గరలో ఉన్న కరెంట్ స్తంబాలలో ఏ ఒక్కటి కూడా బల్బులు వెలుగక పోవడంతో కాలనీలోకి రావాలంటే టు వీలర్ వాహాన సహాయంతో దానితో వచ్చే వెలుతురుతో తమ గమ్యా స్థానాలకు చేరుకోవచ్చు అలాగే నాలుగు గిల్లల వాహానాలతో ఇండ్లలోకి వెళ్తారు.

అదికాకుండా దినసరి కూలీలకు వెళ్ళే మహిళలు సాయంత్రం సమయంలో బయటకు వెళ్ళివచ్చేవారు అలాగే పొద్దంతా వ్యవసాయ పనులు ముగించుకోని ఎడ్ల బండ్లతో వచ్చే రైతులు ఎలా వెళ్ళాలని కాలనీ వాసులు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు.గత 15 రోజులుగా ఇదే తంతు విద్యుత్ అధికారులకు చెబితే ఇదిగో రేపు అదిగో మాపు అంటూ కాలం వెళ్ళాదీస్తున్నారే తప్పా ప్రజల అవసరాలను పట్టించుకోవడం అస్సలే వానాకాలం రాత్రి వేళల్లో విషపురుగులు సంచరించే కాలంలో కూడా సంబంధిత అధికారులు పట్టణ ప్రజలపై నిర్లక్ష్యం చూస్తుంటే మమ్ములను అడిగే నాధుడే లేదన్నట్టు వీరి పాలన వ్వవహారం ఉన్నది.ఇప్పటికయిన సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి మర్రిగడ్డలోని వీధీ దీపాల సమస్యను వెంటనే పరిష్కరించాలని పట్టణ కాలనీ వాసులు కోరుతున్నారు