schedule Monday, August 24, 2026

సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలి

calendar_today March 22, 2025
person meenewstelugu
సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలి

సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలి

 

 డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు మట్టిపల్లి సైదులు

 

మీ న్యూస్ ప్రతినిధి::మోతే: యువతి, యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలని డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు మట్టిపల్లి సైదులు అన్నారు. శనివారం మోతే మండల కేంద్రంలో జరిగిన డివైఎఫ్ఐ మోతే మండల ఐదవ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలో 52 శాతం యువతి,యువకులు ఉన్నారని వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు.

 డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సానబోయిన ఉపేందర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో యువజన సంక్షేమానికి మొండి చేయి చూపారని ఆరోపించారు. డివైఎఫ్ఐ మోతే మండల అధ్యక్షులు బూడిద లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వెలుగు మధు, రైతు సంఘం మండల నాయకులు నాగం మల్లయ్య, గిరిజన సంఘం మండల నాయకులు బానోతు లచ్చరాం నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు చర్లపల్లి మల్లయ్య, బానోతు వెంకన్న, సిఐటియు మండల కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్, డివైఎఫ్ఐ మండల నాయకులు శీలం సతీష్, చెరుకు శీను, బానోత్ రమేష్, మొగిలి ఉపేందర్, రైతు సంఘం నాయకులు వెలగబోయిన రామ్మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.