schedule Monday, August 24, 2026

మోతె మండలంలో డివైఎఫ్ఐ ఐదో మహాసభ

calendar_today March 22, 2025
person meenewstelugu
మోతె మండలంలో డివైఎఫ్ఐ ఐదో మహాసభ

మోతె మండలంలో డివైఎఫ్ఐ ఐదో మహాసభ

నూతన కార్యదర్శిగా వెలుగు మధు చేగువేరా ఎన్నిక

 

మీ న్యూస్ ప్రతినిధి::మోతె మండలంలో జరిగిన డివైఎఫ్ఐ ఐదో మహాసభ లో వెలుగు మధు చేగువేరా మండల కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ మహాసభకు డివైఎఫ్ఐ సీనియర్ నాయకులు మట్టి పెళ్లి సైదులు, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సానబోయిన ఉపేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం లబ్ధి నిరుద్యోగ యువతకు పూర్తిగా అందాలి. పథకం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా, అన్ని ప్రాంతాల్లో అమలయ్యేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి" అని పేర్కొన్నారు. "ప్రతి నిరుద్యోగ యువకుడికి ఈ పథకం లబ్ధి చేకూరేలా డివైఎఫ్ఐ కృషి చేస్తుంది" అని హామీ ఇచ్చారు.అదేవిధంగా, విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడుతూ, "ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. అధిక ఫీజులు, ప్రైవేటీకరణ, స్కాలర్‌షిప్‌లు ఆలస్యం కావడం వంటి సమస్యలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. పేద విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు అందేలా చూడాలి" అని డిమాండ్ చేశారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెలుగు మధు చేగువేరా మాట్లాడుతూ, "మండలంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై డివైఎఫ్ఐ మరింత బలంగా పోరాడుతుంది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తాం" అని తెలిపారు.ఈ మహాసభలో డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.