schedule Monday, August 24, 2026

Sc, BC ల బిల్లుల ఆమోదం చరిత్రాత్మకం కీసర సంతోష్

calendar_today March 22, 2025
person meenewstelugu
Sc, BC ల బిల్లుల ఆమోదం చరిత్రాత్మకం కీసర సంతోష్

Sc, BC ల బిల్లుల ఆమోదం చరిత్రాత్మకం కీసర సంతోష్ రెడ్డి

 

మీ న్యూస్ మార్చి21:బీసీ రిజర్వేషన్ల తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మోతె మండలం ఉర్లుగొండ గ్రామశాఖ ఆధ్వర్యంలో *రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తో పాటు మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు , ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి* చిత్రపటాలకు *పాలాభిషేకం* చేశారు.ఇట్టి కార్యక్రమం లో భాగంగా *బీసీ-ఎస్సీ* వర్గీకరణ ఆమోదం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా *మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి గారు* మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు, MLA లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..విద్యా, ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల్లో *బీసీలకు 42శాతం రిజర్వేషన్* పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం సంతోషంగా ఉందన్నారు...ఇట్టి కార్యక్రమం లో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఇదయ్య గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు గౌడ్, సోషల్ మీడియా మోతె మండల అధ్యక్షులు అర్వపల్లి గణేష్, మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.