schedule Wednesday, August 26, 2026

calendar_today March 12, 2025
person meenewstelugu

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్ ప్రమాణస్వీకారం

 

మీ న్యూస్ మార్చి 12::సూర్యాపేట రూరల్ టేకుమట్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు గట్టు శ్రీనివాసు బుధవారం నాడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారికి, మాజీ మంత్రి జానారెడ్డికి, నల్గొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డికి, టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గారిని మార్కెట్ కార్యదర్శి సంతోష్ కుమార్ శాలువాతో సన్మానించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.