schedule Monday, August 24, 2026

ఉమెన్స్ అండర్-19 క్రికెట్ లీగ్ కు ఎంపిక  పచ్చిపాల మహేశ్వరి 

calendar_today August 27, 2024
person meenewstelugu
ఉమెన్స్ అండర్-19 క్రికెట్ లీగ్ కు ఎంపిక  పచ్చిపాల మహేశ్వరి 

ఉమెన్స్ అండర్-19 క్రికెట్ లీగ్ కు ఎంపిక  పచ్చిపాల మహేశ్వరి 

 

కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్దిఖ్ 

హైదరాబాద్లో జరిగే ఉమెన్స్ అండర్ 19 క్రికెట్ లీగ్ 

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేట జిల్లా కోదాడ...

హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియం లో నిర్వహించిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ సెలక్షన్ పాల్గొని అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ కనబరచి ఉమెన్స్ అండర్ 19 క్రికెట్ లీగ్ కు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి పచ్చిపాల మహేశ్వరి ఎంపికైనట్లు కోచ్ షేక్ సిద్దిఖ్ తెలిపారు.తను ఆగస్టు 27 నుండి హైద్రాబాద్ లో జరిగే ఉమెన్స్ అండర్ 19 క్రికెట్ లీగ్ లో పాల్గొంటుంది అని తెలిపారు.

మహేశ్వరి గత 5 నెలలుగా కోదాడ క్రికెట్ అకాడమీ లో కోచ్ షేక్ సిద్ధిఖ్ వద్ద శిక్షణ తీసుకుంటుంది.

మహేశ్వరి ఎంపికైన సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్, కోదాడ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ డా. కొత్తపల్లి సురేష్, ఖజమీయ, దర్గైయ్య , సురేష్ , జబ్బర్, శ్రీకాంత్ తదితరులు అభినందనలు తెలిపారు.