schedule Wednesday, August 26, 2026

నేడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాక

calendar_today March 2, 2025
person meenewstelugu
నేడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాక

నేడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాక

   

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట: సోమవారం సూర్యాపేట పట్టణానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తరువాత మొదటిసారి సూర్యాపేటకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రారున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాన్ వెస్లీ సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు కుడకుడ రోడ్డులోని బాలాజీ రైస్ మిల్లు దగ్గర స్వాగతం పలికి సూర్యాపేట పురవీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం సూర్యాపేటలో పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగిస్తారని చెప్పారు. సిపిఎం పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, జిల్లా విస్తృస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.