schedule Tuesday, November 03, 2026

విచ్చలవిడిగా కోదాడలో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు

calendar_today March 2, 2025
person meenewstelugu
విచ్చలవిడిగా కోదాడలో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు

విచ్చలవిడిగా కోదాడలో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు

   

⏩::ఎటువంటి పర్మిషన్లు లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు

 

⏩::వాటిల్ కు ఐఎస్ఐ ముద్ర కూడా ఉండదు. 

⏩::టాటా వాటర్ బాటిల్ కు బదులుగా సేమ్ కలర్ ఉండే లోకల్ బాటిల్ ని  తయారీ 

   

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560::లోకల్ బ్రాండ్ తో వాటర్ బాటిల్ సూర్యాపేట జిల్లా కోదాడలో విరివిగా దొరుకుతున్నాయి. ఏదో ఒక పేరు పెట్టుకుని ఎటువంటి పర్మిషన్లు లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆ వాటిల్ కు ఐఎస్ఐ ముద్ర కూడా ఉండదు. లోకల్ లోనే తయారు చేసి అమ్మేస్తున్నారు. కంపెనీ బాటిల్ అడిగితే లోకల్ లో తయారుచేసిన బాటీలను కస్టమర్లకు అంటగడుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి ఘటన కోదాడ పట్టణంలోని ఓ వైన్స్ షాప్ లో చోటుచేసుకుంది. వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం నదరు వినియోగదారుడు మందు తీసుకున్న తర్వాత టాటా.వాటర్ బాటిల్ ఇవ్వమని డబ్బులు చెల్లించాడు.. టాటా వాటర్ బాటిల్ కు బదులుగా సేమ్ కలర్ ఉండే లోకల్ తయారీ బాటిలను తీసుకువచ్చి వినియోగదారుడికు వైన్స్ సిబ్బంది ఇచ్చారు. ఇది టాటా వాటర్ కాదు కదా అని సదరు వినియోగదారుడు ప్రశ్నిస్తే సిబ్బంది నిర్వాహకులు పొంతన లేని సమాధానం చెబుతున్నారు అంటూ వినియోగదారుడు వాపోయాడు..