schedule Monday, August 24, 2026

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురికి గాయాలు

calendar_today August 27, 2024
person meenewstelugu
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురికి గాయాలు

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురికి గాయాలు

గాయపడిన వారిని పోలీస్ వాహనంలో తరలించి మానవత్వం చాటుకున్న పోలీసులు 

   

మీ న్యూస్ అడ్డ గూడూరు శివ నవీన్ 

అడ్డగూడూరు: మీ న్యూస్: తొర్రూర్ వలిగొండ జాతీయ రహదారి బొడ్డుగూడెం స్టేజి సమీపంలో సోమవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను పోలీసు వాహనంలో తరలించి మానవత్వం చాటుకున్నా అడ్డగూడూరు పోలీసులు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని డి.రేపాక గ్రామానికి చెందిన గుండ తరుణ్ తిరుమలగిరి నుండి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అలాగే తొర్రూర్ మండలంలోని చికాటాయపాలెంకు చెందిన మంగళపల్లి మల్సూర్, వేల్పుకొండ మహేందర్, పోచంపల్లి వెళ్లి తిరిగి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు బొడ్డుగూడెం స్టేజి వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌ ఆలస్యం కావడంతో గాయపడిన మాల్సూర్, మహేందర్ పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంలో చాడ వరకు తీసుకువెళ్ళారు. అక్కడకు 108 అంబులెన్స్‌ రావడంతో అందులో భువనగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.