schedule Tuesday, August 25, 2026

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది

calendar_today February 21, 2025
person meenewstelugu
ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది

 

 ⏩::దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే

 

 ⏩::దోపిడి పీడన ఆర్థిక అసమానతలుఉన్నంతకాలం కమ్యూనిజం అజెయఓ

 

 ⏩::సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 21::సూర్యాపేట: ప్రపంచ మానవాళికి విముక్తి చూపించేది ఎర్ర జెండా మాత్రమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఫిబ్రవరి 21 రెడ్ బుక్ డే సందర్భంగా "సిపిఎం పార్టీ 24వ మహాసభ రాజకీయ తీర్మానం, ముసాయిదా, సమీక్ష నివేదికపై నిర్వహించిన సామూహిక అధ్యయనం- చర్చావేదిక" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూప్రపంచంలో దోపిడి, పీడన ,వివక్షత, అణచివేత, ఆర్థిక సమానతలు ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయం గా నిలుస్తుంది అన్నారు. దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే అంతిమ పరిష్కారం అన్నారు.పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించేది కమ్యూనిస్టులేనని అన్నారు. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని ఆపాలనిడిమాండ్ చేశారు. గత సంవత్సరం ఇరుదేశాల ఘర్షనుల మూలంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత మరణ హోమం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరగాకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ చర్చ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జిల్లపల్లి నరసింహారావు, మేకన బోయిన శేఖర్ ,ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం పార్టీ 2 టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి,సిపిఎం పార్టీ రూరల్ మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు చిన్న పంగ నర్సయ్య, మేకన బోయిన సైదమ్మ, కామల్ల లింగయ్య, పొదిల అంజయ్య, జలగం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.