schedule Tuesday, August 25, 2026

శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో శంకర్ యాదవ్ అన్నప్రసాదం 

calendar_today February 20, 2025
person meenewstelugu
శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో శంకర్ యాదవ్ అన్నప్రసాదం 

శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో శంకర్ యాదవ్ అన్నప్రసాదం 

⏩::రోజూ ప‌దివేల మంది శివ‌బ‌క్తుల‌కు అన్నప్రసాద వితరణ

⏩::సేవా త‌త్ప‌ర‌త‌ను చాటుకుంటున్న శంక‌ర్ యాద‌వ్

⏩::శంకర్ యాదవ్ ను సన్మానించిన విశ్వం పంతులు మరియు మిత్రులు

⏩::అభినందించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి

⏩::19వ తేదీ నుంచి 22వ తేది వరకు అన్నప్రసాద వితరణ

మీ న్యూస్ ప్రతినిధి ::శ్రీ‌శైలంలోని శివ‌భ‌క్తుల సేవ‌లో తాండూరుకు చెందిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవ‌ల‌ప‌ర్స్ అధినేత శంక‌ర్ యాద‌వ్ త‌రిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా శ్రీ‌శైల మ‌ల్లికార్జున‌, బ్ర‌మ‌రాంబ ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు అన్న‌దానం చేస్తున్నారు.గత ఎనిమిది సంవసరాలుగా,శంక‌ర్ యాద‌వ్ శ్రీశైలంలో అన్నదానం చేస్తున్నారు. ప్రతి యేడాది బ్రహ్మోత్సవాలలో పాల్గొని అన్నదానం చేయ‌డాన్ని ఆన‌వాయితీగా కొన‌సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ యేడాదిలో గ‌త రెండు రోజుల నుంచి అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. ప్ర‌తిరోజూ 8 వేల నుంచి 10 మంది భ‌క్తుల‌కు అన్న‌దానం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శంక‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు విశ్వంపంతులు బృందం శ్రీశైలం దేవాలయం అర్చకులు గంగాధర్ పంతులుతో పాటు తాండూరు స్నేహితుల బృందం, చెంగోల్ గ్రామ యువకులు, శివస్వాముల తోడ్పాటుతో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. శివ పార్వతుల దయ, ఆజ్ఞతోనే ఈ కార్యక్రమం చేపట్టడం సాధ్యమయ్యిందన్నారు. 19వ తేదీ నుంచి 22వ తేది వరకు ప్రతిరోజూ 8 వేల నుంచి 10 మంది భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రముఖ పండితులు విశ్వం పంతులుగారు శంకర్ యాదవ్ ను శాల్వాతో శివుని విగ్రహాన్ని అందించి ఘనంగా సన్మానించారు

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీశైలంలో అన్నదానం నిర్వహిస్తున్న శంకర్ యాదవ్ ను ఎమ్మెల్యే అభినందించారు

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్,మాజీ ఎంపీపీ రాములు యాదవ్,మిత్రులు జొన్నల వినోద్, వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ యాదవ్,తండ్రి బానోళ్ల హనుమయ్,కుమారుడు అభినవ్ సాయి,బంటు మల్లప్ప, చెంగోల్ మాజీ ఎంపీటీసీ రాము, మేనల్లుడు అరవింద్ యాదవ్, మల్ రెడ్డి,శ్రీను, కిరణ్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి,విట్టల్, నరసింహులు గౌడ్,కళ్యాణం చందు కల్వ ఉమాశంకర్,శ్రీకాంత్ మధుసూదన్ రెడ్డి,పీకే మల్లేష్ వెంకటేష్,చెంగోల్ గోపాల్,రఘునాథ్ రెడ్డి,మహేందర్,అరుణ్ కుమార్,అనిల్,యాదయ్య, అంజి ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.