schedule Tuesday, August 25, 2026

మేకల కృష్ణయ్య సమాజానికి చేసిన సేవలు మరువలేనిది

calendar_today February 20, 2025
person meenewstelugu
మేకల కృష్ణయ్య సమాజానికి చేసిన సేవలు మరువలేనిది

మేకల కృష్ణయ్య సమాజానికి చేసిన సేవలు మరువలేనిది

 

 ⏩::సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

 

మీ న్యూస్ ప్రతినిధి:: మోతే: మేకల కిష్టయ్య సమాజానికి చేసిన సేవ మరువలేనిదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారంమోతే మండలం సర్వారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మేకల కిష్టయ్య దశదినకర్మకు హాజరై ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన మేకల కిష్టయ్య తన జీవితాంతం సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. గ్రామంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచిన మహానుభావుడు కిష్టయ్య అన్నారు. ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని భయపడకుండా ముందుకు సాగాలని అన్నారు. తన బంధు మిత్రులకు ఎలాంటి కష్టం వచ్చిన వారికి అండగా నిలిచారని అన్నారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు భయ్యా మల్లయ్య యాదవ్, జటంగి గురవయ్య, భయ్యా మల్లికార్జున్ యాదవ్, ఉప్పల అంజయ్య యాదవ్, వేల్పుల లింగయ్య యాదవ్, ములకలపల్లి శ్రీను భయ్యా లింగయ్యతదితరులు పాల్గొన్నారు.