schedule Tuesday, August 25, 2026

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.

calendar_today February 13, 2025
person meenewstelugu
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి...

-- మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి 

 

  మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13 నూతనంగా నియమింపబడ్డ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బీజేపీ పార్టీలో అకుంఠిత శ్రమ చేసిన సామాన్య కార్యకర్తలు ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఆశించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులను సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు