schedule Saturday, August 22, 2026

ఫిబ్రవరి 5 న బీసీ డిమాండ్స్ సాధనకై కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించండి

calendar_today February 5, 2025
person meenewstelugu
ఫిబ్రవరి 5 న బీసీ డిమాండ్స్ సాధనకై కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించండి

ఫిబ్రవరి 5 న బీసీ డిమాండ్స్ సాధనకై కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించండి

 బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపు

   

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 4::బీసీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికై ఈ నెల ఐదవ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాలు మరియు ఆర్డిఓ కార్యాలయాల్లో వివిధ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించినట్లు బీసీ హక్కుల సాధన సమితి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు తెలియజేశారు.

 మంగళవారం నాడు సూర్యాపేటలోని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యాలయంలో సంఘానికి చెందిన జిల్లా ఆఫీసు బ్యారర్ల తో కలిసి ఆయన మాట్లాడుతూ.... దేశవ్యాప్తంగా జనగణలలో కులగణన చేపట్టాలని, ఆ వచ్చే రిపోర్టు ను పట్టి ఆయా కులాల జలాభా నిష్పత్తి ప్రకారమే చట్టసభల్లో రిజర్వేషన్ తో పాటు విద్య వైద్య ఉపాధి రంగాల్లోనూ ఉద్యోగాల్లోను మరియు ఉద్యోగాల ప్రమోషన్ లోను రిజర్వేషన్ అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో బీసీ భవన్ లు నిర్మించాలని, తెలంగాణలో ఇటీవల చేపట్టిన సర్వే ఆధారంగానే రాజకీయ రిజర్వేషన్ నిర్ణయించి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం మాత్రమే రిజర్వేషన్ చేయాలన్న దాన్ని చట్టం చేయాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని పార్లమెంట్లో రాజకీయ రిజర్వేషన్లు అమలయ్యే దాకా ఇండియా కూటమి కృషి చేయాలని,,42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కు బిసి హక్కుల సాధన సమితి సమ్మతించదని, కచ్చితంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు నిర్ణయించాలని ఇంకా వివిధ డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్లకు ఆర్డిఓ లకు సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 ఆయన వెంట బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాదే నరసయ్య జిల్లా అధ్యక్షుడు దంతాల రాంబాబు, విద్యార్థి సంఘం నాయకుడు రేఖ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు