schedule Thursday, August 27, 2026

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

calendar_today January 30, 2025
person meenewstelugu
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

 

మీ న్యూస్ ప్రతినిధి::మోతె: మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి బుధవారం గ్రామస్తులకు అందజేశారు. గ్రామంలో 9 మంది లబ్ధిదారులకు 3, 63, 500 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కాగా వారికి చెక్కులను అందజేశారు. ఉపాధి హామీ పథకంలో నలుగురు లబ్ధిదారులకు పశువుల కొట్టాలు మంజూరు కాగా వాటికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని, ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.