schedule Wednesday, August 26, 2026

ఈనెల 31 బిఆర్ఎస్ పార్టీ మోతే మండల సర్వసభ్య సమావేశం 

calendar_today January 30, 2025
person meenewstelugu
ఈనెల 31 బిఆర్ఎస్ పార్టీ మోతే మండల సర్వసభ్య సమావేశం 

ఈనెల 31 బిఆర్ఎస్ పార్టీ మోతే మండల సర్వసభ్య సమావేశం 

మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు

 

మీ న్యూస్ ప్రతినిధి మోతే జనవరి 29::మోతె మండల కేంద్రంలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్దేశంతో మోతే మండలం హుస్సేనాబాద్ గ్రామంలోని *మాజీ ఎంపీపీ అరె లింగారెడ్డి గారి* నివాసంలో మీటింగ్స్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కోసం శ్రమించే ప్రతి ఒక్క కార్యకర్త కోసం,పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థలు , పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సిద్దం చేయడమే లక్ష్యంగా జరిగే ఈ సమావేశానికి *మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు*. మోతే మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలురి వెంకటేశ్వరరావు, యూత్ అధ్యక్షులు జానీ పాషా, మండల నాయకులు నూకల శ్రీనివాస్ రెడ్డి, నవీల రామకోటి, గూగులోతు శంకర్ నాయక్, దేవల నాయక్, పల్సు మాల్సూర్, మైనపాటి శ్రీనివాస్ రెడ్డి, సాధ్యా నాయక్, వడ్డె వీరయ్య, మారయ్య, జిల్లెపల్లి ముత్తయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.