మీ న్యూస్ ప్రతినిధి::మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మి జాతీయ జెండాని ఎగరవేసి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. అనంతరం మిఠాయిలు పంచారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటిష్ వారితో ఎన్నో స్వతంత్ర కోసం ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే నేడు జరుపుకుంటున్న ఈ గణతంత్ర వేడుకలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందిగామ కృష్ణారెడ్డి, పెద్దలు సతీష్ బాబు, వెంకటరెడ్డి, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు ,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.