schedule Saturday, August 22, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి 

calendar_today January 27, 2025
person meenewstelugu
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి 

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి 

మండల ప్రత్యేక అధికారి సీతారాం నాయక్ 

మీ న్యూస్ ప్రతినిధి:::మండల పరిధిలోని విబలాపురం గ్రామంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల పరిధిలోని విలాపురం గ్రామంలో ప్రారంభించారు. అనంతరం నాలుగు పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ లబ్ధిదారులు ఎంపికైన లబ్ధిదారులకు విడతలవారీగా సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులైన వారు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంఘమిత్ర, ఎంపీడీవో ఆంజనేయులు, ఏవో అరుణ, ఎస్సై యాదవేందర్ రెడ్డి, ఏపీఎం వెంకయ్య, ఏపీవో నగేష్, ఆర్ ఐ లు మన్సూర్ అలీ, నిర్మల, ఏఈఓ లు ఉష, వినోద్, ప్రియాంక, ఝాన్సీ, వివిధ గ్రామపంచాయతీ కార్యదర్శులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, మాజీ సర్వారం సొసైటీ చైర్మన్ గురువారెడ్డి, లక్ష్మారెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.