schedule Saturday, August 22, 2026

ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ కి గవర్నర్ పురస్కారం

calendar_today January 27, 2025
person meenewstelugu
ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ కి గవర్నర్ పురస్కారం

ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ కి గవర్నర్ పురస్కారం

జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణ కు పర్యావరణ విభాగంలో గవర్నర్ ప్రతిభ పురస్కారం ఆదివారం గవర్నర్, సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.

మోతే మీ న్యూస్ ప్రతినిధి::మండలం పరిధిలోని రాఘవపురం లో తనకున్న 70 ఎకరాల భూమిని మానవ అడవగా సృష్టించాడు.ప్రకృతి మనకు ఇంత ఇస్తుంటే కొంతైనా తిరిగి ఇవ్వాలనుకుని చిన్నప్పటి నుంచే గట్టిగా భావించి, ఆ తర్వాత ఉద్యోగం వదులుకొని పంటలు పండే భూమిలో అడవిని సృష్టించారు. పశుపక్ష్యా దుల కోసం నీటి కొలనులనూ నిర్మించారు. ఆ అడవిలో పూసిన పువ్వు, కాయ, పండ్లన్నీ అందులో నివసించే పక్షులు, జంతువులకే సొంతం అంటారాయన. పర్యావరణ పరిరక్షణ కోసం అంతటి మహా యజ్ఞం చేస్తున్న ఈయన నదీ జలాల వాటా కోసం ఉద్య మించారు. 1980లో సాగు జలాల కోసం మొదలు పెట్టిన జలసాధన సమితి ఉద్యమం 1986లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధి తులకోసం ఉద్ధృతమైంది. ఈ ఉద్య మాన్ని ఎంతలా ముందుకు తీసుకెళ్లా రంటే.. 1996లో జరిగిన ఎన్నికల్లో పార్ల మెంటుకు జిల్లా నుంచి 481 మందిని పోటీలో నిలపడంతో దేశంలోనే అతిపెద్ద బ్యాలెట్గా అప్పట్లో సంచలనమే అయింది. జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుసర్ల సత్యనారాయణకు గవర్నర్ పురస్కారం రావడంతో ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.