schedule Thursday, August 27, 2026

ఈనెల 25న జరిగేసిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయండి

calendar_today January 23, 2025
person meenewstelugu
ఈనెల 25న జరిగేసిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయండి

ఈనెల 25న జరిగేసిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయండి

 

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

 

మీ న్యూస్ ప్రతినిధి:::సూర్యాపేట టౌన్ :జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి లో నిర్వహిస్తున్న సిపిఐఎం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా జనవరి 25న జరిగే బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలో సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ మహాసభలో గత మూడు ఏళ్లలో ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలను సాధించిన విజయాలను చర్చించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం చేయవలసిన పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. 25న నిర్వహించే బహిరంగ సభకు రాష్ట్ర నాలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలకు పోలీట్ బ్యూరో సభ్యులు బృందా కరక్, బివి రాఘవులు, విజయ రాఘవన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, కొప్పుల రజిత, మద్దెల జ్యోతి, వీరబోయిన రవి, సిపిఎం పార్టీ వన్ టౌన్  వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కప్పల సత్యం, టేకుల సుధాకర్, మాధగోని మల్లయ్య, గంగపురి శశిరేఖ, బచ్చల కూర రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.