schedule Saturday, August 22, 2026

రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే తహసీల్దార్ సంఘమిత్ర  

calendar_today January 17, 2025
person meenewstelugu
రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే తహసీల్దార్ సంఘమిత్ర  

రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే తహసీల్దార్ సంఘమిత్ర

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 16::సూర్యాపేట జిల్లాలోని మోతే మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సాగు చేయని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారిని రైతు భరోసా పథకానికి అనర్హులుగా తొలగించడానికి ప్రభుత్వ అధికారులు గురువారం నుండి సర్వే నిర్వహించారు గురువారం గ్రామాల వారిగా జరిగే సర్వే ప్రారంభమైనది ఈ సందర్భంగా తహాసిల్దార్ సంఘమిత్ర మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుంటూ జనవరి 16 నుండి 20 వరకు గ్రామాల వారిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ సర్వే నెంబర్ ప్రకారం సాగు చేయని భూములు గుర్తించాలన్నారు సాగు చేయని భూముల్లో రాళ్లు గుట్టలను సర్వే ద్వారా వివరాలు సేకరించాలని పల్లెల్లో లేఅవుట్లు నాలాగా మార్చిన భూములను ఇండస్ట్రీలకు సంబంధించిన వివరాలను సర్వే ద్వారా సేకరిస్తున్నామని సాగు చేయని భూములు వివరాలను జనవరి 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలో తెలియపరచి వారిని రైతు భరోసా పథకంకు అనర్హులుగా గుర్తించాలని సూచించారు తదిపరి సాగు చేసే ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12 వేల రూపాయలను రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు అదేవిధంగా సర్వేకు వచ్చే అధికారులకు గ్రామ ప్రజలు సహకరించగలరు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సీతారాం నాయక్ మండల వ్యవసాయ అధికారి అరుణఆర్ఐ లు నిర్మల మన్సూర్ ఆలీ సర్వేర్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు