schedule Friday, November 06, 2026

calendar_today January 11, 2025
person meenewstelugu

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కక్కిరేణి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు

మీ న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జనవరి 10::::వైకుంఠ ఏకాదశి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఉత్తర ముఖంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక మండపం వద్ద స్వామి అమ్మవార్లను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, సోదరుడు కక్కిరేణి ప్రసాద్ లు దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రజా అర్చకులు నల్లని చక్రవర్తుల వేణుగోపాలచార్యులు స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు.