schedule Monday, August 24, 2026

యువకుని ఇంటి ముందు ధర్నా

calendar_today January 7, 2025
person meenewstelugu
యువకుని ఇంటి ముందు ధర్నా

యువకుని ఇంటి ముందు ధర్నా

 

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

 

న్యాయం జరగకపోతే ఆత్మ హత్యే శరణ్యమని యువతి 

 

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 07 ::: సూర్యాపేట టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువకుని ఇంటి ముందు న్యాయం చేయాలని కోరుతూ పట్టణానికి చెందిన యువతి ధర్నా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ లో సోమవారం చోటుచేసుకోంది. గత రెండేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రం సుందరయ్య నగర్ కు చెందిన యువకుడు బరపటి మహేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేశాడని యువతి ఆరోపించింది. యువకుని తల్లిదండ్రులు తనను పెళ్లి చేసుకోవద్దని బలవంత పెట్టడంతో తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని అనంతరం అతనే ప్రభుత్వ జనరల్ చేర్పించాడని రెండు రోజుల తర్వాత తనను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లాడని పోలీస్ స్టేషన్లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తల్లిదండ్రుల మాటలు విని ఒంటరిదాన్ని చేశాడని తన తల్లిదండ్రులు నన్ను వదిలేశారని ఎలాగైనా తనకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మ హత్యే శరణ్యమని యువతి ఆరోపించింది. ఆ యువకునితోనే పెళ్లి జరిపించాలని యువతి కోరింది.