schedule Monday, August 24, 2026

బర్త్ డే పార్టీకి అని పిలిచి ఓ వ్యక్తిని దారుణ హత్య

calendar_today January 2, 2025
person meenewstelugu
బర్త్ డే పార్టీకి అని పిలిచి ఓ వ్యక్తిని దారుణ హత్య

బర్త్ డే పార్టీకి అని పిలిచి ఓ వ్యక్తిని దారుణ హత్య

 

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 01:::: డిసెంబర్ 31 నైట్ చివ్వెంల మండలం లో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలను గ్రామస్తులు వెల్లడించారు. లక్ష్మీ నాయక్ తండాకు చెందిన ధరావత్ శేషు (35)ని సమీప బంధువులు బర్త్ డే, న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుందామని పిలిచారు. కానీ శేషును పార్టీ పేరుతో పిలిచిశ్రీరాం నగర్ కాల్వ మీదుకు తీసుకెళ్లి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. హతుడు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే ఆ రెండు కుటుంబాలకు గత కొన్నాళ్లుగా భూతగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి హుటాహుటిన లక్ష్మీ నాయక్ తండాకు చేరుకోని భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.