schedule Thursday, August 27, 2026

నూతన దేవాలయ పాలకమండలి ఏర్పాటు 

calendar_today December 27, 2024
person meenewstelugu
నూతన దేవాలయ పాలకమండలి ఏర్పాటు 

నూతన దేవాలయ పాలకమండలి ఏర్పాటు 

   

ముఖ్య అతిథులుగా గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు, లక్ష్మీనారాయణ రెడ్డి

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 27 ::: సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరకత్ గూడెం గ్రామం శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన దేవాలయ పాలకమండలి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు, లక్ష్మీనారాయణ రెడ్డి , డేగ శ్రీధర్ వచ్చి కమిటీ వారిని ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది.కమిటీకి ఎన్నుకున్న కమిటీ సభ్యులు చైర్మన్గా పోలిశెట్టి శ్రీనివాసరావు, ధర్మకర్త పట్టే సైదులు ,ధర్మకర్త కొండ గోపయ్య ధర్మకర్త ,ఇనుకుర్తి వీరాచారి ,ధర్మకర్త కొర్ర తులసి ,ధర్మకర్త గోవింద రామారావు ,ధర్మకర్త గుడిపాటి వెంకటరమణ గారిని నియమించడం జరిగినది.  గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సామెల్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. దేవాలయ అభివృద్ధి కోసం అతిధులు వారికి హామీ ఇవ్వడం జరిగినది గుడి అభివృద్ధికి గుడికి కావాల్సిన ఏమైనా ఉంటే వాటిని వారు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి బరకథ గూడెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.