schedule Thursday, November 05, 2026

మేల్ శాంతి రవి ని సన్మానించిన అయ్యప్ప దీక్షపరులు.

calendar_today December 13, 2024
person meenewstelugu
మేల్ శాంతి రవి ని సన్మానించిన అయ్యప్ప దీక్షపరులు.

మేల్ శాంతి రవి ని సన్మానించిన అయ్యప్ప దీక్షపరులు.

సూర్యాపేట మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 ::: ప్రముఖ మేల్ శాంతి అవుటపల్లి రవి స్వామిని అయ్యప్ప మాలధారణ స్వాములు ఘనంగా సన్మానించారు. కేరళ సాంప్రదాయ పద్ధతిలో తాంత్రిక పూజలు నిర్వహించడంలో ఆయన ప్రసిద్ధిగాంచారు.రంగు ముత్యం రాజు గురు స్వామి నివాసం లో జరిగిన పూజ కార్యక్రమం లో పలువురు గురు స్వాములు, అయ్యప్ప దీక్ష స్వాములు ఘనంగా సన్మనించారు. ఈ సాసందర్బంగా అయన మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ తీసుకున్న స్వాములు దీక్ష నియమాలు పాటిస్తూ హైందవ దర్మం కాపాడేందుకు కృషి చేయాలన్నారు. దీక్ష తీసుకున్న ప్రతి స్వామిలో మార్పు రావాలని అప్పుడే అ దీక్ష కు సర్దకత చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో సీనియర్ గురు స్వాములు వంకాయలపాటి శంకర్ స్వామి, భూపతి శ్రీనివాస్స్వామి, లక్ష్మణ్ స్వామి, జి శ్రీను స్వామి, ముంతా శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్, మాలి లింగారెడ్డి, తుడి మధు, వెన్నె మధుకర్ రెడ్డి, అఖిల్, నాగయ్య, అశోక్, రవి చౌదరి రెడ్డి,జీవన్, రంగు స్వాతి, సాయి ప్రీతి తదితరులు పాల్గొన్నారు.