schedule Friday, August 28, 2026

59 ఉప కులాలు అభివృద్ధికి చర్యలు చేపట్టాలి

calendar_today December 13, 2024
person meenewstelugu
59 ఉప కులాలు అభివృద్ధికి చర్యలు చేపట్టాలి

59 ఉప కులాలు అభివృద్ధికి చర్యలు చేపట్టాలి

యం జె ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పల్లెల లక్ష్మణ్ 

మోతే న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12::: యస్సీ వర్గీకరణ వన్ మెన్ కమిషన్ విచారణ తో 59 యస్సీ ఉప కులాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని యం జె ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పల్లెల లక్ష్మణ్ అన్నారు గురువారం యస్సీ వర్గీకరణ వన్ మెన్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ కు పలు డిమాండ్ల తో కూడిన వినతి పత్రం సమర్పించారు అనంతరం ఒక ప్రకటనలో లక్ష్మణ్ పలు విషయాలు వెల్లడించారు రాజ్యాంగ అమలు చేయబడి సుమారు 75 సంవత్సరాల నుంచి నేటి వరకు అనేక అంశాల పట్ల మార్పులు జరిగాయని కేవలం మాదిగ మాదిగ ఉప కులాల జీవన విధానం, విద్యా, వైద్య ఆరోగ్య,ఆర్థిక ,స్థితి గతులు మారడం లేదని కనీస అవసరాలు కూడా తీరటం లేదని కుడు గుడ్డ నీడ తో పాటు ఆర్థిక రాజకీయ రంగాలలో తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు ఇంకా గ్రామాలలో డప్పు కొట్టి చెప్పులు కుట్టి జీవిస్తున్న వారికి ఏ ఒక్క అవకాశం లభించడం లేదని ప్రతి కులానికి సమాన అవకాశాలు దక్కే విధంగా వన్ మెన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గట్టి గుండ్ల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు